Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాస్త్ర, సాంకేతిక అంశాలపై ప్రధానికి మంచి సలహాదారు అవసరం: సీఎన్ఆర్ రావు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అద్భుత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అన్నారు. అయితే పాలనా అంశాల్లో శాస్త్ర, సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై సలహాలు అందించేందుకు ఆ రంగంలో నిపుణులైన సలహాదారు అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పేదరికం వంటి అనేక సమస్యలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. భారత్ లో పరిశోధనలకు ప్రాముఖ్యత ఇవ్వడం, పరిశోధనల ఫలాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దవచ్చని రావు పేర్కొన్నారు.

More Telugu News